'నింగి నేల నాదే'కి ప్రశంసలు
సంకల్పబలం ముందు అంగవైకల్యం ఓ లెక్క కాదని, చిన్నాపెద్దా అంతా చూడదగిన స్ఫూర్తిదాయక చిత్రం 'నింగి నేల నాదే' అనీ రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. 'ఇన్విజబుల్ వింగ్స్' పేరుతో చైనీస్ భాషలో రూపొంది పలు అవార్డులు, రివార్డులు అందుకున్న చిత్రాన్ని సుజన మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై 'నింగి నేల నాదే'గా చావా సుధారాణి అనువదించి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. లీ చింగ్ యావో ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి పెంగ్ బెంజి దర్శకుడు. రెండ్రోజుల క్రితమే 'నింగి నేల నాదే' వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన చావా సుధారాణి గురువారంనాడు ఈ చిత్రాన్ని మంత్రుల కోసం ప్రత్యేకంగా హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రత్యేక ప్రివ్యూ అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనేది ఈ చిత్రంలో చూపించారనీ, అంగవైక్యల్యం ఉన్నా వారే కాకుండా అందరూ ఈ చిత్రాన్ని చూడాలని అన్నారు. సంకల్పబలం ముందు అంగవైకల్యం పనిచేయదని చెప్పే చిత్రమిదనీ, అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కొండా సురేఖ పేర్కొన్నారు. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఎన్నో వ్యయప్రయాలకోర్చి ఈ చిత్రాన్ని అనువదించామని చావా సుధారాణి తెలిపారు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|