కాలిఫోర్నియాలో 'కర్మ'
భారతీయ సంస్కృతిలోని ఫిలాసఫీని వివిధ ప్రపంచ దేశాలు సైతం ఆమోదించాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో 'కర్మ' అనే థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. అమెరికాలో ఉంటున్న తెలుగు యువకుడు శేష్ అడవి (మాజీ మిస్టర్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో పాటు కీలక పాత్రను కూడా పోషిస్తున్నారు. సాయికుమార్ అడవి ('వినాయకుడు' దర్శకుడు) సమర్పణలో భవాని అడవి, హరీష్ సింగ్, షేర్ అలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ నటి జడే టైలర్, షేర్ అలీ మరో రెండు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ కాలిఫోర్నియాలో జరుగుతోంది. అక్కడి ప్రఖ్యాత బిక్స్ బై క్రీక్ బ్రిడ్జిపై కీలకమైన హెలికాప్టర్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
శేష్ అడవి మాట్లాడుతూ, కర్మి సిద్ధాంతం చుట్టూ నడిచే కథాంశమిదనీ, ప్రేక్షకులకు చక్కటి థ్రిల్ తో పాటు వినోదం కూడా పుష్కలంగా ఇందులో ఉంటుందనీ చెప్పారు. సినిమా మొత్తం ఇండియన్ కల్చర్ చుట్టూనే ఉంటుందన్నారు. ఆగస్టు తొలివారంలో ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అమెరికాలో ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను యాడ్ ల్యాబ్స్ సొంతం చేసుకుందని తెలిపారు.
ఈ చిత్రానికి లీల్యాండ్ ట్యూన్స్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) పెటె వన్ (సాంగ్స్), అలెక్స్ లింగ్ (ఫీచర్డ్), కవి రియల్ సాహిత్యం, భాను ఎనమండ్ర, వి.బైన్స్ మేకప్-కాస్ట్యూమ్స్, హరీష్ సింగ్ ఎడిటింగ్, జేమ్స్ లాక్స్ టన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|