ఆర్ఎఫ్ సిలో అల్లు అర్జున్
స్టయిలిష్ హీరో అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్ లో యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. అల్లు అర్జున్ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆర్ఎఫ్ సిలో కళాదర్శకుడు అశోక్ నిర్మించిన భారీ సెట్ లో చివరిదైన నాలుగో షెడ్యూల్ జరుగుతోంది.
ఈనెల 5న ప్రారంభమైన ఈ షెడ్యూల్ 30వ తేదీ వరకూ షూటింగ్ జరుపుకొంటుందని నిర్మాత దానయ్య తెలిపారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్ర నిర్మాణం సాగుతోందన్నారు. 'దేశముదురు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తో తమ బ్యానర్ లో నిర్మిస్తున్న రెండో చిత్రమిదనీ, అల్లు అర్జున్-గుణశేఖర్ కాంబినేషన్ లో మొదటిదనీ చెప్పారు. అల్లు అర్జున్ సరసన ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా పనిచేస్తున్నామనీ, నెగిటివ్ పాత్రను తమిళ హీరో ఆర్య పోషిస్తున్నారనీ తెలిపారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఆంథోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|