'ఇంకోసారి' హిట్టిస్తారా?
తొలినాళ్లలో చిన్నాచితకా పాత్రల్లో నటించి 'ఆనంద్' చిత్రంతో ఒక్కసారిగా యూత్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజా ఆ తర్వాత నుంచి హీరోగా వరుస అవకాశాల విషయంలో వెనుదిరిగి చూసుకోలేదు. అయితే కొద్దికాలంగా ఆయనకు సక్సెస్ లు ముఖం చేటేస్తున్నాయి. ప్రేక్షకులలో మంచి అంచనాలు రేకెత్తించిన 'మాయాబజార్', 'మిస్టర్ మేథావి', 'సొంతవూరు' వంటి చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దీంతో రాజా ప్రస్తుతం డిఫెన్స్ లో పడ్డారు. తన తదుపరి చిత్రాలపైనే పూర్తి శక్తియుక్తులు కేంద్రకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజా నటించిన 'ఇంకోసారి' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాజా సరనస, మంజరి ఫడ్నిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బే మూవీస్ పతాకంపై సుమన్ పాతూరి దర్శకుడిగా కళ్యాణ్ పల్ల నిర్మిస్తున్నారు.
రాజా సైతం ఈ చిత్రం విజయంపై థీమాగా ఉన్నారు. 'ఇది పూర్తి స్థాయి యూత్ ఫుల్ చిత్రం. స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. విశేషించి ఈ చిత్రానికి పనిచేస్తున్న వారంతా 30 సంవత్సరాల లేపువారే. దీంతో యూత్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తాజాగా సినిమా రషెస్ కూడా చూశాను. చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ చిత్రం తర్వాత సునమన్ పాతూరి చాలా పెద్ద దర్శకుడు అవుతారు' అని రాజా ధీమాగా చెబుతున్నారు. ఈ చిత్రంతోనైనా రాజాకు ఫెయిల్యూర్స్ నుంచి మంచి ఉమశమనం లభించి ప్రేక్షకులు 'ఇంకోసారి' హిట్టిస్తారేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|