ఆర్తితో మాసన ఫిలింస్ చిత్రం
ఆర్తి అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్ స్పీడ్ అవుతోంది. ఇటీవలే 'నీలవేణి', పోనాని కృష్ణమురళి చిత్రాల తర్వాత మరో కొత్త చిత్రానికి హీరోయిన్ గా ఆర్తి కమిట్ అయింది. మానస ఫిలింస్ పతాకంపై లంక రాజశేఖర్, కొలన్ శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ డైరెక్టర్ స్వర్గీయ కట్టా సుబ్బారావు కుమారుడు, పలు చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన కట్టా శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
కట్టా శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ, పలు తెలుగు-తమిళ-కన్నడ చిత్రాలకు తాను ఎడిటర్ గా పనిచేశాననీ, కన్నడంలో ఎడిటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మూడు చిత్రాలు నిర్మించాననీ చెప్పారు. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రమనీ, వందశాంత కామెడీ, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో సినిమా ఉంటుందనీ చెప్పారు. కథ చెప్పగానే ఆర్తి అగర్వాల్ అంగీకరించారనీ, ఇంతవరకూ ఆమె చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ను ఆమె ఇందులో పోషించనున్నారనీ తెలిపారు. దర్శకుడిగా తన కెరీర్ కు ఈ చిత్రం మంచి హెల్ప్ అవుతుందనే గట్టి నమ్మకం ఉందన్నారు. శ్రీకర్ ప్రసాద్ చెప్పిన సబ్జెక్ట్ నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులతో పాటు పరిశ్రమలోని కమెడియన్స్ అంతా నటించనున్నారనీ, జూలై నాలుగో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. 'నీలవేణి', పోసాని చిత్రాల త్వాత తనకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఇదనీ, శ్రీకర్ ప్రసాద్ కథ చెబుతున్నప్పుడే తాను ఇన్ స్పైర్ అయ్యాననీ ఆర్తి అగర్వాల్ పేర్కొంది. ఈ చిత్రం తనకు మరో మంచి హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|