ఉషా కిరణం అల్లరి నరేష్
ఇవాల్టి యువతరం హీరోలంతా సిక్స్ పాక్స్ యాబ్స్ పై దృష్టి సారిస్తుంటే పేరులోనే అల్లరిని ఇముడ్చుకున్న అల్లరి నరేష్ మాత్రం ఎడాపెడా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంతవరకూ 30 సినిమాల్లో నటించిన నరేష్ గత ఏడాది ఏకంగా ఎనిమిది రిలీజ్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది సైతం ఆయన అరడజను సినిమాలకు కమిట్ అయ్యారు. సహజంగా అల్లరి నరేష్ తో సినిమాలు తీసిన వారిలో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారే కావడం విశేషం. ఇటీవల వారిలో ఆయా రంగాల్లో ఆర్థిక మాంద్యం ప్రభావం పడింది. దీంతో నరేష్ ఇప్పుడు సీనియర్ ఫిల్మ్ మేకర్స్ తో వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం నరేష్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇవివి సత్యనారాయణ దర్శకుడిగా డి.రామానాయుడు నిర్మిస్తున్న 'బెండు అప్పారావు' (ఆర్ఎంపి) చిత్రం నిర్మాణంలో ఉంది. తాజాగా మరో ప్రిస్టేజియస్ బ్యానర్ లో నటించే అవకాశాన్ని కూడా అల్లరి నరేష్ అందిపుచ్చుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ తర్వాత అత్యధిక సినిమాలు నిర్మించిన సంస్థగా పేరున్న ఉషాకిరణ్ మూవీస్ తదుపరి చిత్రంలో నరేష్ హీరోగా ఎంపికైనట్టు సమాచారం.
'ప్రతిఘటన', 'మయూరి', 'చిత్రం' వంటి పలు హిట్లు అందించిన ఉషాకిరణ్ సంస్థ ఇటీవల కాలంలో పలు ఫ్లాపులు చవిచూస్తోంది. అయితే ఈమధ్యనే విడుదలైన 'నచ్చావులే' చిత్రం మళ్లీ ఉషాకిరణ్ సంస్థకు సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఆ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా అల్లరి నరేష్ తో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. వినోద ప్రధాన చిత్రాలు తీయడంలో మంచి పేరున్న ఇ.సత్తిబాబు ('ఓ చినదానా' ఫేమ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివారాలు వెల్లడికానున్నాయి.
Be first to comment on this News / Article!
|