'రాజు-మహరాజు'కు ప్లాటినం
మోహన్ బాబు, శర్వానంద్, రమ్యకృష్ణ, సుర్విన్ చావ్లా, తషు కౌషిక్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'రాజు మహరాజు'. దుర్గా శంకర్ నాథ్ దర్శకత్వంలో కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక కూకట్ పల్లిలోని కళామందిర్ షోరూమ్ లో జరిగింది. శర్వానంద్, తషు కౌశిక్, ఢిల్లీ రాజేశ్వరి, గీత రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, దర్శకనిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ, 'రాజు-మహరాజు' చిత్రం మంచి టాక్ తెచ్చుకుందనీ, కలెక్షన్లు కూడా బాగా పెరిగాయనీ చెప్పారు. తాను నటించిన చిత్రానికి ప్లాటినం డిస్క్ రావడం ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాత కుమార స్వామి మాట్లాడుతూ, ఈ చిత్రానికి వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం బంగారు గాజులు, వెండి కుంకుమ భరణి, పట్టుచీరలతో ఓ స్కీమ్ పెట్టామనీ, సినిమాకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం చాలా సంతోషంగా ఉందనీ చెప్పారు. కారణాంతరాల వల్ల సంగీత దర్శకుడు ఈ వేడుకలో పాల్గొనలేదనీ చెప్పారు. నిర్మాత కుమారస్వామి ఎక్కడా రాజీ పడకుండా చిత్ర నిర్మాణం జరిపారని దర్శకుడు దుర్గా శంకర్ నాథ్ పేర్కొన్నారు. సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా రోజురోజుకూ మంచి ప్రేక్షకాదరణ లభిస్తోందన్నారు. సంగీతం, సాహిత్యం చక్కగా కుదరడంతో ఈరోజు ప్లాటినం డిస్క్ కూడా లభించిందన్నారు. అనంతరం చిత్రయూనిట్ కు ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది.
Be first to comment on this News / Article!
|