'ఎవరైనా ఎపుడైనా..' హిట్టే
వరుణ్ సందేష్, విమలారామన్ హీరోహీరోయిన్లుగా మార్తాండ్ కె.శంకర్ దర్శకత్వంలో ఏవీయం సంస్థ నిర్మించిన 'ఎవడైనా ఎపుడైనా' చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోందని చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లో నిర్వహించారు. వరుణ్ సందేష్, మార్తాండ్ కె శంకర్, మార్తాండ్ కె.వెంకటేష్, దిల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ చిత్రం తొలికాపీ చూసినప్పుడే మంచి చిత్రమవుతుందని అనిపించిందనీ, ఆ తర్వాత థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి చూసినపుడు చక్కటి విజయం సాధిస్తుందని అనుకున్నాననీ చెప్పారు. ఊహించిన విధంగానే ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోందన్నారు. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు. మొదటివారంలో పెట్టుబడి 90 శాతం వసూలైనట్టు చెప్పారు. దర్శకుడు మార్తాండ్ కె.శంకర్ మాట్లాడుతూ, ఏవియం సంస్థలో పనిచేయడం తన అదృష్టమనీ, చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలనీ అన్నారు. ఈ చిత్రంలో తాను విభిన్నమైన పాత్రను పోషించాననీ, మాస్ అంశాలు మిళితమైన తన పాత్రను ప్రేక్షకులు ఎంతో బాగా ఆదరిస్తున్నారని వరుణ్ సందేష్ పేర్కొన్నారు. ఏవియం సంస్థ అంటేనే మంచి పేరుందనీ, అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉండటంతో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని కోట శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నటి రమాప్రభ సైతం పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|