మళ్లీ దత్ కాంబినేషన్: ఎన్టీఆర్
'కంత్రి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత మళ్లీ సి.అశ్వనీదత్ బ్యానర్ లో నటిస్తుండటం చాలా హ్యాపీగా ఉందని ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడుగా వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దీనికి మెహర్ రమేష్ ('కంత్రి', 'బిల్లా' ఫేమ్) దర్శకుడు. ఎన్టీఆర్ సరనస ఇలియానా కథానాయికగా ఎంపికైంది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ, మెహర్ రమేష్ చెప్పిన స్టోరీ తనకు బాగా నచ్చిందనీ, మళ్లీ 'కంత్రి' కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, దత్తుగారి బ్యానర్ లో చేస్తుండటం తన అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు. వైజయంతీ సంస్థ నిర్మిచిన అన్ని చిత్రాల్లోనూ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా ఉంటుందనీ, తారక్ తో చేస్తున్న ఈ చిత్రం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్ లొకేషన్లలో అత్యం భారీగా ప్లాన్ చేశామనీ అశ్వనీదత్ తెలిపారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నుంచి వస్తున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇదని పేర్కొన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ, 'కంత్రి' వంటి హిట్ తర్వాత తారతో అశ్వనీదత్ గారి బ్యానర్ లో చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సబ్జెక్ట్ వినగానే తారక్, దక్ ఎక్స్ టార్డినరీగా ఉందంటూ అభినందించారనీ, వైజయంతీ బ్యానర్ లో ఓ సెన్సేషన్ హిట్టిచ్చే అవకాశం తనకు మరోసారి వచ్చిందనీ అన్నారు. అక్టోబర్ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. చలసాని ధర్మారావు సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|