యూరప్ లో 'మగధీర'
రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మగధీర'. గీతా ఆర్ట్స్ పతాకంపై సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు ఈ చిత్రం ఆడియో సేల్స్ కూడా రికార్డు స్థాయిలో ఉన్నట్టు ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా తెలిపారు. కాగా, ఈ చిత్రంలోని చివరి పాటను యారప్ లో ఈ మంగళవారం నుంచే చిత్రీకరిస్తున్నారు.
'నా కోసం నువ్ జుత్తు పీక్కుంటే బాగుంది..మహ బాగుంది' అంటూ సాగే ఈ పాటను రామచరణ్, కాజల్ పై చిత్రీకరిస్తున్నారు.ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని అత్యధిక ప్రింట్లతో ప్రపంచమంతటా ఈనెల నాలుగో వారంలో విడుదల చేసేందుకు నిర్మాత అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ, ఎం.రత్నం మాటలు, కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రమా రాజమౌళి స్టైలింగ్, రవీందర్ కళాదర్శకత్వం, పీటర్ హెయిన్స్ ఫైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|