'నింగి నేల నాదే' గేమ్ షో
చైనీస్ 'ఇన్విజబుల్ వింగ్స్' చిత్రానికి తెలుగు అనువాదరూపంగా గత శుక్రవారం విడుదలైన 'నింగి నేల నాదే' చిత్రానికి సంబంధించిన గేమ్ షోను హైద్రాబాద్ లో మంగళవారంనాడు ఆవిష్కరించారు. ఆన్ లైన్ రియల్ గేమ్ కు చెందిన మహతీ శంకర్ రూపొందించిన ఈ గేమ్ షోను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. చిత్ర నిర్మాత చావా సుధారాణి, టెన్నిస్ క్రీడాకారిణి సైనా, ఇటీవలే యాసిడ్ దాడికి గురై మృత్యుంజయురాలైన ప్రణిత, పలువురు స్కూలు విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు వీరికోసం చిత్ర ప్రదర్శన కూడా నిర్వహించారు.
మంత్రి మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తనను కంటతడి పెట్టించాయనీ, యువత తప్పనిసరిగా ఈ చిత్రాన్ని చూసి స్ఫూర్తి పొందాలనీ అన్నారు. ఆటల్లో పోటీని ఎదుర్కోవాలంటే ఎలాంటి సంకల్పం ఉండాలో ఈ చిత్రంలో చూపించారనీ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే తనకు ఈ చిత్రం మంచి స్ఫూర్తినిచ్చిందనీ సైనా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా యాసిడ్ దాడి నుంచి మృత్యుంజయిరాలైన ప్రణతి మొక్కవోని దీక్షతో ఇంజనీరింగ్ లో డిస్టెక్షన్ తెచ్చుకున్నందుకు ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన లాప్ టాప్ ను మంత్రి ఆమెకు ప్రదానం చేశారు.
Be first to comment on this News / Article!
|