స్నేహ కోరుకునే మగాడు...
'ఉత్సాహంగా ఉల్లాసంగా'తో ప్రేక్షకులకు దగ్గరై ప్రస్తుతం 'కరెంట్'తో యువతరం ప్రేక్షకులకు గ్లామర్ షాక్ లిస్తున్న స్నేహ ఉల్లాల్ ఇప్పుడు టాలీవుడ్ లోనే సెటిల్ కావాలనే తెలివైన నిర్ణయం కూడా తీసుకుంది. ప్రతిసారి తాను ముంబై టు హైద్రాబాద్ చక్కర్లు కొట్టడం వల్ల నిర్మాతలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉండటంతో హైద్రాబాద్ లోనే సొంత ఇల్లు కొనుక్కొని అందరికీ అందుబాటులో ఉండాలనుకుంటున్నట్టు చెప్పింది. అల్లు అర్జున్ తో స్నేహకు ఎఫైర్ ఉందనే వదంతులు ఆ మధ్యన వినిపించినప్పటికీ వాటిని స్నేహ అంతగా ఖాతరు చేయడం లేదు. ఇదే విషయమై ప్రశ్నించినప్పుడు 'వావ్...నిజంగానే అలా అనుకుంటున్నారా? నాకింతవరకూ తెలియదు. అల్లు అర్జున్, రామ్ వంటి వారంతా నాకు మంచి మిత్రులు మాత్రమే' అని స్నేహ వివరణ ఇచ్చింది.
మరి స్నేహ కోరుకునే మగా(గ)డులో ఎలాంటి క్వాలిఫికేషన్లు ఉండాలి? 'నాకు జంతవులంటే చాలా ఇష్టం. శాఖాహార ప్రచారాన్ని కూడా చేస్తున్నాను. నాకు కాబోయే వ్యక్తి తప్పని సరిగా శాఖాహారి కావాలి. అతని ఫిజిక్ గురించి పట్టించుకోను. అయితే చూడ ముచ్చటగా ఉండాలి. నన్ను బాగా అర్ధం చేసుకోగలిగి ఉండాలి' అంటూ చెప్పుకొచ్చింది. ప్రేమ వివాహం, పెద్దల కుదిర్చే వివాహంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తావని అడిగితే 'ప్రేమ వివాహం అంటే ఇష్టం. ఎందుకంటే మా కుటుంబంలో అందరివీ ప్రేమ వివాహాలే. నాన్నగారు సౌంత్ ఇండియన్. అమ్మ నార్త్ ఇండియన్. నా సోదరి కూడా సౌత్ ఇండియన్ నే పెళ్లాడింది. నా విషయానికి వస్తే ఒక షరతు ఉంది. నన్ను కోరుకునే వ్యక్తి నా కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా నచ్చాలి' అని తెగేసి చెప్పింది. ఇప్పుడంతా బికినీల సందడే కదా...నీ నిర్ణయం ఏమిటి స్నేహా అని అడిగితే 'నా వరకూ బికినీ వేసుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడను. గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడియెన్స్ ను ఆకట్టుకునే సత్తాపైనే ఏ నటి కెరీర్ అయినా ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతాను. అలాగని బికినీ వేసుకునే వాళ్లను ప్రశంసించకుండా ఉండలేను. అలా అందాలు చూపించడానికి కూడా గట్స్ కావాలి' అంటూ తెలివిగా సమాధానమిచ్చింది స్నేహ.
Be first to comment on this News / Article!
|