బుల్లితెరకు నమ్రతా మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడిన నమ్రతా శిరోద్కర్ ఇప్పుడు మరోసారి తెరపై కనిపించబోతోంది. అయితే ఈసారి వెండితెరపై కాకుండా బుల్లితెరకు దగ్గరవుతోంది. నిర్మాతగా కూడా మారి సొంతంగా ఓ బుల్లితెర షోను నిర్మించనుంది. మరాఠీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోందని నమ్రత తెలిపింది. మరాఠీ తన మాతృభాష కావడంతో తొలిసారి ఈ వెంచర్ చేపడుతున్నట్టు పేర్కొంది.
వివాహానంతరం సినిమాలకు స్వస్తి చెప్పిన సోదరి శిల్పా శిరోద్కర్ తో కలిసి నమ్రత ఈ షో జడ్జిగా వ్యవహరించనుండటం విశేషం. ఈ విషయాన్ని నమ్రత ధ్రువీకరిస్తూ, పిల్లల కోసం చేసే ఈ డాన్స్ రియాలిటీ షోలో తానూ, శిల్పా కలిసి తొలిసారి కనిపించడనుండటం చాలా ఎగ్జయింటింగ్ ఉందన్నారు. ఈ షో కోసం తరచు ముంబై వెళ్లవలసి ఉన్నప్పటికీ అది ఇంటికి దూరమైనట్టు కాదనీ, ప్రస్తుతం షూటింగ్ అంతా హైద్రాబాద్ లోనే షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నామనీ, అందువల్ల సిటీ వదిలి వెళ్లాల్సి వస్తుందనే బెంగ లేదనీ చెప్పుకొచ్చింది. టీవీ షోలో తొలిసారి రంగప్రవేశం చేస్తున్న తరుణంలో మునుముందు మరింత బిజీ అయ్యే అవకాశాలపై ప్రశ్నించినప్పుడు, మరిన్ని షోలు చేయాల్సిందిగా పలు ఛానెల్స్ కోరుతున్నాయనీ, అయితే ప్రస్తుతం అవన్నీ చర్చల దశలోనే ఉన్నందున త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాననీ నమ్రత తెలిపింది.
Be first to comment on this News / Article!
|