దీపావళికి 'కొమురం పులి'
పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'కొమురం పులి' చిత్రం హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇంతవరకూ 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలవుతుందని దర్శకుడు ఎస్.జె.సూర్య వెల్లడించారు.
పవన్ కల్యాణ్ తో 'ఖుషీ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మళ్లీ అంతకంటే పెద్ద హిట్ ఇవ్వాలనే తపనతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రసుతం తన ఆలోచనంతా 'కొమురం పులి' పైనే ఉందనీ, ఇందులో పవన్ కల్యాణ్ మీసంతో కనిపించే స్టిల్స్ ఇప్పటికే అందర్నీ ఆలోచించపజేస్తున్నాయనీ, ఆతరహాలోనే ఆయన పాత్ర కూడా ఇందులో అద్భుతంగా ఉంటుందనీ తెలిపారు. పవన్ తన క్యారెక్టర్ లో పరకాయప్రవేశం చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ కూడా ప్రోగ్రస్ లో ఉందనీ, దీపావళికి సినిమా రిలీజ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో పవన్ ఓ ఫవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపించబోతున్నారు. అవినీతి అధికారులు, ఎమ్మెల్యేల భరతం పట్టేవిధంగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పవన్ కు జోడిగా నిఖిష పటేల్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతోంది. మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, శరణ్య, నాజర్, ఆలీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. విజయన్ ఫైట్స్, ఆనంద్ సాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|