నన్ను టార్గెట్ చేశారు: నయన
మీడియా తరచు తనను టార్గెట్ చేస్తోందనీ, తమ కథనాలకు సొంత ఊహాగానాలు జోడించడం తనకు ఆవేదన కలిగిస్తోందనీ గ్లామర్ నటి నయనతార వాపోతోంది. నయనతార, ప్రభుదేవాల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతున్న నేపథ్యంలో నయన కదలికలపై ఆమె తల్లిదండ్రులు నిఘా వేశారనీ, ఇక నుంచి ఆమె వెంటే షూటింగ్ స్పాట్ లకు కూడా వెళ్లాలని నిశ్చయించుకున్నారనీ మీడియా కథనాలు తాజాగా ప్రచారం లోకి వచ్చాయి. ఇంతవరకూ ప్రభుదేవాతో లవ్ ఎఫైర్ గురించి పెదవి విప్పని నయనతార ఈసారి మాత్రం తన తల్లిదండ్రులను ఇలాంటి కథనాల్లోకి లాగడం పట్ల మీడియాపై గుర్రుమంది.
'కెరీర్ తొలినాళ్లలో నాకు తోడుగా నాన్నగారి సెట్స్ కు వచ్చేవారు. ఆ తర్వాత ఆయనను కష్టపెట్టడం ఇష్టంలేక సింగిల్ గానే తన వ్యవహారాలను చక్కబెట్టుకుంటానని చెప్పారు. అప్పట్నించీ అలాగే చేస్తున్నాను కూడా. బహుశా తల్లిదండ్రుల తోడు లేకుండా ఇంటిపెండెంట్ గా షూటింగ్ లకు హాజరవుతున్న హీరోయిన్ నేను ఒక్కరినే కావచ్చు' అంటూ వివరణ ఇచ్చింది. తన విషయంలో మీడియా అత్యుత్సాహం చూపిస్తూ ఊహాగానాల ఆధారంగా కథలల్లుతోందనీ, ఇలాంటి రాతలపై తాను పెద్దగా బాధ పడకున్నా అనవసరంగా తన కుటుంబ సభ్యులను కూడా వార్తలోకి లాగుతుండటం మనోవేదన కలిగిస్తోందని పేర్కొంది. ఇంతా చెప్పిన నయనతార షరామాములుగానే ప్రభుదేవాతో పెళ్లి యోచనపై అడిగినప్పుడు 'నో కామెంట్' అంటూ ముఖం చాటేసింది. ప్రస్తుతం నయనతార హైద్రాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఎన్టీఆర్ 'అదుర్స్ ', రవితేజ 'ఆంజనేయులు' చిత్రాల షూటింగ్ లో పాల్గొంటోంది. మలయాళంలో దిలీప్ సరసన 'బాడీగార్డ్ ' చిత్రంలోనూ నయనతార నటిస్తోంది. గత వారమే తమిళంలో సూర్య సరసన నటిస్తున్న 'ఆదవన్' చిత్రం షూటింగ్ లో పాల్గొంది. మరో తమిళ చిత్రానికి కూడా త్వరలోే అగ్రిమెంటే చేయనుంది.
Be first to comment on this News / Article!
|