స్టన్నింగ్ దుస్తుల్లో షీలా..!
'పరుగు' చిత్రంలో పదహారణాల తెలుగుమ్మాయిలా, 'మస్కా'లో గ్లామర్ తళుకులతో యువతరం అభిమానులను అలరించిన షీలా ఇప్పుడు కన్నడ సీమలోకి కూడా అడుగుపెట్టింది. ఇటీవలే తన తొలి కన్నడ చిత్రం 'ప్రేమ్ కహాని' ఆడియో ఫంక్షన్ లో షీలా తన అందాలను మరింత బహిర్గతం చేసే దుస్తులు వేసుకుని పాల్గొనడం పలువురుని షాక్ తినిపించింది. కన్నడ హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గొన్నప్పుడు తమ 'క్లీవేజ్'ను బహిర్గతం చేసే సాహసం ఇంతవరకూ చేయకపోవడమే ఇందుకు కారణం.
ఇలాంటి షాక్ లు ఎందుకు ఇచ్చావు షీలా అని అడిగితే 'ఈ సినిమాలో నేను సింపుల్ గా, అమాయకంగా కనిపించే ఓ డబ్బున్నమ్మాయి పాత్ర పోషిస్తున్నాను. అయితే పబ్లిక్ ఫంక్షన్ కు వచ్చినప్పుడు స్క్రీన్ ఇమేజ్ కు భిన్నంగా కనిపించాలనుకున్నాను. నా డ్రెస్ అభ్యంతరకరంగా ఉందని మీ అభిప్రాయం కావచ్చు. నేను మాత్రం అలా అనుకోవడం లేదు. ఫంక్షన్ కు వచ్చిన పలువురు అమ్మాయిలు నన్ను అభినందించారు. ఈ డ్రస్ లో నేను ఎంతో బాగున్నానంటూ మెచ్చుకున్నారు. నా డ్రెస్ డీసెంట్ గా ఉంటూనే అందర్నీ చూపుతిప్పుకోలేని విధంగా చేయడం సంతోషంగా ఉంది' అంటూ వివరణ ఇచ్చింది. నయనతార, త్రిషలను మించిన గ్లామర్ ఇమేజ్ కోరుకుంటున్నారా అని మళ్లీ అడిగినప్పుడు, సింపుల్ గాళ్ గానో, సెక్సీ ఇమేజ్ తెచ్చుకోవాలనో తాను అనుకోవడం లేదనీ, పాత్ర డిమాండ్ మేరకు స్విమ్ షూట్ ధరించాల్సి వస్తే వెనుకాడేది లేదనీ చెప్పుకొచ్చింది. స్క్రీన్ పై కళ్లుచెదరగెట్టానంటే సెక్స్ ఇమేజ్ కోరుకుంటున్నట్టు అర్ధం కాదనీ, ఇప్పటికే పాపులర్ అయిన నయనతార, త్రిష వంటి హీరోయిన్లతో తనను ఎంతమాత్రం పోల్చవద్దనీ పేర్కొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నయనతారతో ఎంతో ఎంజాయ్ చేస్తూ తాను నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
Be first to comment on this News / Article!
|