జెనీలియా 'కథ' అరుకులో...
జస్ట్ ఎల్లో సినిమా బ్యానర్ పై 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'అమ్మచెప్పింది' వంటి వైవిధ్యభరిత చిత్రాలను అందించిన గుణ్ణం గంగరాజు మరోసారి తన బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం 'కథ'. యువతను తన అభినయంతో అలరిస్తున్న జెనీలియా కథానాయికగా నటిస్తోంది. అరుణ్ కథానాయకుడు. శ్రీనివాస రాగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అరుకులో జరుపుకొంది.
తొలిసారిగా ఈ చిత్రం ప్రోగ్రస్ ను గుణ్ణం గంగరాజు తెలియజేస్తూ, ఇంతవరకూ జరిగిన షూటింగ్ తో రెండు పాటలు, 50 శాతం టాకీ పూర్తి అయినట్టు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని చెప్పారు. జెనీలియా ఇందులో టీచర్ గా నటిస్తోందనీ, ఇంతవరకూ ఆమె చేయనటువంటి క్యారెక్టర్ ఇదనీ తెలిపారు. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉంటాయనీ, టాకీతో పాటు మిగిలిన రెండు పాటలు ఈనెల13 నుంచి హైద్రాబాద్ లో చిత్రీకరించనున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు మాటలు, ఏండ్రు సినిమాటోగ్రఫీ, రవీందర్ కళాదర్శకత్వం, ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|