ఏడిదకు లైఫ్ టైమ్ అవార్డు
తెలుగువారు గర్వించదగిన పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ విజయవంతంగా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.
పూర్ణోదయ సంస్థ అధినేతి ఏడిద నాగేశ్వరరావు ఈ బ్యానర్ పై 'శంకరాభరణం', 'స్వాతిముత్యం', 'సాగరసంగమం', 'సితార', 'సీతాకోక చిలుక', 'స్వయంకృషి' వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. పూర్ణోదయ సంస్థ మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకున్న ఏడాది నాగేశ్వరరావుకు జీవన సౌఫల్య అవార్డు (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్)ను ప్రదానం చేస్తున్నట్టు సంఘం అకాడమీ సంస్థ తెలియజేసింది.
ఈనెల 14వ తేదీన రవీంద్రభారతిలో ఈ అవార్డును ఏడిద నాగేశ్వరరావుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 'సినీ పూర్ణోదయం'అనే పుస్కకావిష్కరణ కూడా జరుగుతుంది. పూర్ణోదయ సంస్థ నుంచి వచ్చిన చిత్రాల సమాచారంతో సీనియర్ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ ఈ పుస్తకాన్ని రచించారు.
Be first to comment on this News / Article!
|