'ప్రేమించే రోజుల్లో' ఆడియో
ప్రేమించే రోజులు గుర్తుకు వస్తే ఎవరికైనా హృదయం పరవళ్లు తొక్కుతుంది. సరిగ్గా అలాంటి ఇతివృత్తానే తీసుకుని ఎస్.వి.క్రియేషన్స్ సంస్థ 'ప్రేమించే రోజుల్లో' అనే చిత్రాన్ని నిర్మించింది. విశ్వప్రసాద్ దర్శకుడు. విజయానంద్, కీర్తి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో గురువారంనాడు జరిగింది. నటుడు, నిర్మాత డాక్టర్ సాంబశివరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో నిర్మాత సుధాకర్ బాబుకు అందజేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ, ఈ చిత్రం ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించి దర్శకనిర్మాతలకు చక్కటి పేరు తెచ్చిపెట్టాలని అభిలషించారు. సంగీత దర్శకులలో ఒకరైన నాని మాట్లాడుతూ, ఈ చిత్రంలోని ఐదు పాటలకు తాను సంగీతం అందించినట్టు చెప్పారు. రీరికార్డింగ్ తో పాటు ఒక పాటకు సంగీతం అందించినట్టు మరో సంగీత దర్శకుడు అర్జున్ పేర్కొన్నారు. ఇందులో ఎ నుంచి జడ్ వరకూ ఉన్న అక్షరాలతో ఉండే ఓ పాట తాను రాసినట్టు గీత రచయిత రాణి కుముందాదేవి తెలిపారు. ఈ చిత్రానికి రచనా సహకారం అందించడం తనకు మంచి అనుభూతినిచ్చిందని సులోచనారాణి చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, త్వరలో విడుదల చేస్తామని దర్శకుడు విశ్వప్రసాద్, నిరమాతలు కె.అరుణ్ కుమార్, బి.సత్యనారాయణ, వి.బి.పూర్ణచంద్రరావు తెలిపారు.
Be first to comment on this News / Article!
|