కిరణ్ రాథోడ్ రొమాంటిక్ ఫిల్మ్
'అందరూ దొంగలే దొరికితే', 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' వంటి చిత్రాల్లో నటించిన కిరణ్ రాథోడ్ మరోసారి తెలుగులోకి అడుగుపెట్టింది. కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా ఐశ్వర్య ఫిలిమ్స్ పతాకంపై మల్లన్న నిర్మాతగా ఓ కొత్త చిత్రం ప్రారంభమైంది. నరసింహ నంది దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో గురువారంనాడు మొదలైంది. కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు హర్షవర్దన్ క్లాప్ ఇవ్వగా, హీరో బాలాదిత్య కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుల సంఘం కార్యదర్శి జి.రాంప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్ర విశేషాలు దర్శకుడు నరసింహ నంది తెలియజేస్తూ, గతంలో తాను '1940లో ఒక గ్రామం' చిత్రానికి దర్శకత్వం వహించాననీ, ఇది తన రెండో చిత్రమనీ చెప్పారు. 13 ఏళ్ల బాలుడికి 30 ఏళ్ల అమ్మాయికి మధఅయ సాగే ప్రేమ ఇతివృత్తంతో కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందన్నారు. రెండు షెడ్యూల్స్ లో సినిమా పూర్తవుతుందని చెప్పారు. తెలుగులో తనకు ఇది నాలుగో చిత్రమని, ఇంతవరకు ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్ర చేయలేదనీ కిరణ్ రాధోడ్ పేర్కొంది. దర్శకుడు చెప్పిన కథ నచ్చి సినిమా మొదలుపెట్టామని నిర్మాత మల్లన్న తెలిపారు. అశ్లీలతకు తావులేకుండా కుటుంబ సమేతకంగా చూసేవిధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఒక థీమ్ సాంగ్, నాలుగు పాటలు ఉంటాయని సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, తిలక్, రాగిణి, రజిత, జెన్నీ, గౌతంరాంజు, మల్లిక, చంద్ర, సుదర్శన్, రంగ తదితరులు నటిస్తున్నారు. నరసింహ నంది కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ సినిమాటోగ్రఫీ, నాగరాజు కొరియోగ్రఫీ, వాసు కళాదర్శకత్వం వహిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|