విలక్షణ చిత్రం 'ఓయ్'
కొన్ని చిత్రాలు అరుదుగా మాత్రమే వస్తాయని, రెగ్యులర్ కు భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఓయ్' అనీ ఆ చిత్ర కథానాయకుడు సిద్దార్ధ అభివర్ణించారు. సిద్దార్ధ, షామిలి జంటగా ఆనంద్ రంగ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రం సక్సెస్ మీట్ ను శుక్రవారంనాడు నిర్వహించారు.
సిద్దార్ధ మాట్లాడుతూ, ఇది రెగ్యులర్ ప్రేమకథా చిత్రం కాదనీ, ఈ చిత్రానికి స్క్రిప్టే హీరో అనీ అన్నారు. ఈ చిత్రం చూసి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దిల్ రాజు ఓ గొప్ప సినిమా చేశావంటూ ప్రశంసించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారనీ, ఆనంద్ రంగా టేకింగ్, విజయ్ కె.చక్రవర్తి ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానిక హైలైట్స్ గా నిలుస్తున్నాయని అన్నారు. ఈ చిత్రాన్ని సురేష్ మూవీస్ ద్వారా నైజాంలో విడుదల చేసినట్టు డి.సురేష్ బాబు పేర్కొన్నారు. తొలివారంలో కోటిన్నర రూపాయలు వసూలు చేయడంతో పాటు మంచి చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటోందన్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ తన ధన్యవాదాలనీ, ఇంత మంచి చిత్రం రూపొందడానికి హీరో సిద్దార్ధ కారణమని నిర్మాత దానయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటలు సురేఖావాణి, కృష్ణుడు, గుంటూరు డిస్ట్రిబ్యూటర్ డి.ఎస్.రావు, మాటల రచయిత రాజసింహ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|