'కరెంట్' విజయయాత్ర
'కరెంట్' చిత్రానికి ఆంధ్రదేశమంతటా మంచి ప్రేక్షకాదరణ లభిస్తున్నట్టు చిత్రయూనిట్ తెలియజేసింది. సుశాంత్, స్నేహ ఉల్లాల్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన 'కరెంట్' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 'కనెక్టింగ్ హార్ట్స్' పేరుతో విజయయాత్ర చేసి వచ్చింది. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో చిత్రయూనిట్ ఆ విశేషాలను శుక్రవారంనాడు తెలియజేసింది.
ఉత్తరాంధ్ర నుంచి గత శనివారంనాడు విజయయాత్రను మొదలుపెట్టామనీ, తొలుత వైజాగ్ లో అక్కినేని అభిమానులతో గెట్ టుగెదర్ నిర్వహించామని నిర్మాత శ్రీనివాసరావు తెలిపారు. ఈ గెట్ టుగెదర్ లో ఎమ్మెల్యే విజయప్రసాద్, ప్రొఫెసర్ శివాజీ, అభిమానులు పాల్గొని సుశాంత్ నటనకు అభినందలు తెలియజేశారనీ, మంచి ప్రేమకథా చిత్రంగా 'కరెంట్' ప్రశంసలు అందుకుందని చెప్పారు. అనంతరం అరసవెల్లి సూర్యదేవర ఆలయాన్ని సందర్శించి అక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, నెల్లూరు, కడప, పొద్దుటూరు, కర్నూలు, మహబూబ్ నగర్ తదిత పాత్రాలో విజయయాత్ర సాగించి అక్కడి థియేటర్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు చెప్పారు. శనివారంనాడు వరంగల్ లో పర్యటిస్తామనీ, ప్రతిచోట మంచి కలెక్షన్లతో చిత్రం ప్రదర్శింతమవుతుండటం తమకు చాలా సంతోషంగా ఉందనీ చెప్పారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ, తన తొలి చిత్రం 'కాళిదాసు' కు కరచాలన యాత్ర చేయగా, ఈసారి 'కరెంట్' కు కనెక్టింగ్ హార్ట్స్ పేరుతో విజయయాత్ర జరిపినట్టు చెప్పారు. అక్కినేని అభిమానులు తనపట్ల చూపిస్తున్న ఆదరణ ఎన్నటికీ మరవలేనని తెలిపారు. చక్కటి ప్లానింగ్ తో ఈ సినిమా చేశామనీ, అభిరుచి గల నిర్మాతలు దొరకడం వల్ల సినిమా బాగా రావడంతో పాటు చక్కటి ప్రేక్షకాదరణ చూరగొంటోందని దర్శకుడు సూర్యప్రతాప్ తెలిపారు.
Be first to comment on this News / Article!
|