'బాణం' వేస్తున్న వేదిక
నారా రోహిత్ ను కథానాయకుడుగా పరిచయం చేస్తూ వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా వేదిక ఎంపికైంది. గతంలో 'ముని', 'విజయదశమి' వంటి చిత్రాల్లో వేదిక కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి తొలుత తమన్నా పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు హీరోయిన్ గా వేదిక వచ్చిచేరింది. ఈ చిత్రానికి 'బాణం' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది.
సినీరంగ నేపథ్యం ఉన్న కుటుంబ నుండి నటీనటులు రావడం కొత్త కాదు. నందమూరి, దగ్గుబాటి, ఘట్టమనేని, అక్కినేని కుటుంబాల నుంచి చాలామందే హీరోలయ్యారు. కొత్త హీరోలను పరిచయం చేయడంలో అశ్వనీదత్ కు మంచి పేరుంది. మహేష్ బాబు (రాజకుమారుడు), అల్లు అర్జున్ (గంగోత్రి), రామ్ చరణ్ (చిరుత), తారకరత్న (ఒకటో నెంబర్ కుర్రాడు)లను అశ్వనీదత్ తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈసారి నట వారసత్వం నుంచి కాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న నారావారి కుటుంబం నుంచి రోహిత్ హీరోగా పరిచయం అవుతుడటం విశేషం. నారాచంద్రబాబు నాయుడు సోదరుడైన నారా రామ్మూర్తి నాయుడు తనయుడే రోహిత్. ఈ చిత్రం ద్వారా చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యువత తలుచుకుంటే ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలదనే కథాంశంతో 'బాణం' చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుతం ప్రచారార్భాటలకు దూరంగా విశాఖ, విజయనగరం, కర్ణాటకలో
ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. ఆడియో వేడకను అత్యంత ఆర్భాటంగా నిర్వహించి నారా రోహిత్ ను పరిచయం చేయాలని అశ్వనీదత్ ఆలోచనగా తెలుస్తోంది. 'బాణం' టార్గెట్ ను రీచ్ అయి రోహిత్ కు హీరోగా మంచి సక్సెస్, వేదకకు తెలుగులో ఆశించిన బ్రేక్ అందిస్తుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|