సొంత బ్యానర్ లో రాణా
సినీ వారసత్వం పరిశ్రమకు కొత్తకాదు. శతాధిక చిత్రాల నిర్మాత డి.రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ఆయన మరో తనయుడు డి.సురేష్ బాబు అగ్రనిర్మాత. ఇప్పుడు రామానాయుడు మనుమడు, సురేష్ బాబు తనయుడైన రాణా తొలిసారిగా హీరోగా నటిస్తున్న 'లీడర్' చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ఎవిఎం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం తర్వాత రాణా రెండో చిత్రం సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ద్వారా రచయిత జి.ఎస్.రావు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
జి.ఎస్.రావు గతంలో ఎన్టీఆర్ 'సాంబ' చిత్రానికి కథ అందించారు. సురేష్ బ్యానర్ నుంచి వచ్చిన పలు చిత్రాలకు కథా చర్యల్లో కూడా ఆయన పాల్గొనేవారు. రచయితగానే కాకుండా మంచి విజువల్ సెన్స్ కూడా ఆయనకు బాగా ఉందని చెబుతారు. రాణాను దృష్టిలో పెట్టుకుని ఓ పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ తో కూడిన స్క్రిప్టును జిఎస్ రావు రెడీ చేస్తున్నారు. స్టోరీ లైన్ వినగానే సురేష్ బాబు ఎంతో ఇంప్రెస్ అయ్యారనీ, జిఎస్ రావు దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే పూర్తి వివారాలు వెలుగుచూడనున్నాయి.
Be first to comment on this News / Article!
|