హిమాలయాలకా? నేనా?
'ఇవేం రిపోర్డులండీ బాబూ! నేను హిమాలయాలకు వెళ్లినట్టు ఎవరు చెప్పారు?' అంటూ విస్తుపోతున్నాడు హీరో విశాల్. 'పొగరు', 'పందెంకోడి' చిత్రాలతో యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విశాల్ ఇటీవల 'సెల్యూట్', 'పిస్తా' చిత్రాలతో ఫెయిల్యూర్స్ బాట పట్టడంతో డిప్రెషన్ లో ఉన్నారనీ, మానసిక స్వాంతన, ప్రశాంతత కోసం ఇటీవలే హిమాలయాలకు వెళ్లారనీ రెండ్రోజుల క్రితం చెన్నై సర్కిల్స్ లో బలమైన ప్రచారం జరిగింది. రజనీకాంత్ తరహాలోనే విశాల్ కూడా హిమాలయాల బాట పట్టారంటూ పలు వార్తాకథనాలు కూడా వచ్చాయి. ఇయితే ఇవన్నీ ఊహాగానాలేననీ, ఇందులో వాస్తవం లేదనీ విశాల్ తాజాగా వివరణ ఇచ్చారు.
'రజనీ సార్ తరహాలోనే నేను కూడా హిమాలయాలకు వెళ్లనట్టు వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయాను. నేను చెన్నైలో లేకపోవడంతో ఇలాంటి వార్తలు వచ్చి ఉంటాయి. నేను కొద్దిరోజులుగా హైద్రాబాద్ లో ఉంటున్నాను. అక్కడ్నించి ఎక్కడికీ వెళ్లింది కూడా లేదు' అని విశాల్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాయనీ, త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాననీ ఆయన పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|