ఆంజనేయులు ఆడియో 24న
క్రేజీ స్టార్ రవితేజ, అందాలనటి నయనతార జంటగా పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఆంజనేయులు'. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈనెల 24న ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల ఆడియోను విడుదల చేయనున్నట్టు గణేష్ బాబు తెలిపారు.
రవితేజ బాడీలాగ్వేంజ్ కు తగ్గట్టుగా యాక్షన్ తో కూడిన హ్యూమర్ తో ఈ చిత్రాన్ని పరశురామ్ చాలా చక్కగా తెరకెక్కిస్తున్నారనీ, రవితేజ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందనీ ఆయన అన్నారు. రవితేజ-నయనతార జంట కన్నుల పండువగా ఉంటుందన్నారు. ఎక్కడా రాజీపడుకుండా చిత్రనిర్మాణం జరుగుతోందనీ, ఆగస్టు రెండో వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, ఎం.ఎస్.నారాయణ, సన, వినయప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పరశురామ్ (బుజ్జి) సమకూరుస్తున్న ఈ చిత్రానికి కె.రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, థమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|