'ధన్ రాజ్'గా బాలకృష్ణ
యంగ్ స్టార్ లు పలువురు ఏడాదికి ఒక సినిమాకే పరిమితమవుతున్న తరుణంలో అగ్రహీరోలు మాత్రం తమ జోరు పెంచుతున్నారు. 'పాండురంగడు', 'మిత్రుడు' చిత్రాలు బాలకృష్ణకు ఆశించిన సక్సెస్ ను ఇవ్వకపోయినా అగ్ర నిర్మాతలు మాత్రం ఆయనతో సినిమాలు తీసేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. పరుచూరి కీర్తి, బెల్లంకొండ సురేష్ చిత్రాలకు బాలకృష్ణ కొత్తగా కమిట్ అయ్యారు.
'భద్ర', 'తులసి' వంటి రెండు సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కీర్తి చిత్రం ఉండబోతోంది. దీనికి 'ధన్ రాజ్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తాజా సమాచారం. బాలకృష్ణ ఇమేజ్ ను ఇబ్బడిముబ్బడిగా పెంచే కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందనీ, ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లోనే ఉంటుందనీ తెలుస్తోంది. బాలకృష్ణకు జోడిగా నయనతార నటించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాస్త ముందు వెనుకలుగా బాలకృష్ణ-బెల్లంకొండ సురేష్ కాంబినేషన్ చిత్రం కూడా ఇదే సమయంలో ప్రారంభమవుతుంది. దీనికి 'భీష్మ' అనే టైటిల్ ను ప్రకటించారు. రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్) దర్శకుడు. వీటిలో ఒక చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి, మరో చిత్రం సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వస్తాయి.
Be first to comment on this News / Article!
|