'అన్న'లెవరూ లేరు: నమిత
'మగవాళ్లంతా నాకు బాగా దగ్గరవాళ్లే. ఎవర్నీ అన్నా అని మాత్రం పిలిచేది లేదు' అంటోంది భారీ అందాల బ్యూటీ నమిత. తమిళంలో అమితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నమిత ఇప్పుడు తెలుగులోనూ తనకు అభిమానులు గుడి కట్టించేటంతటి క్రేజ్ తెచ్చుకోవాలని తహతహలాడుతోంది. ఇటీవల 'బిల్లా'తో బికినీ మెరుపులు సృష్టించిన నమిత ఇప్పుడు 'జగన్మోహిని' అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధపడుతోంది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం విఠలాచార్య దర్శకత్వంలో విజయవంతమైన 'జగన్మోహిని' చిత్రానికి రీమేక్ గా నమిత 'జగన్మోహిని' రూపొందుతోంది. అలనాటి చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా భారీ గ్రాఫిక్స్ తో దర్శకుడు ఎన్.కె.విశ్వనాథన్ దర్శకత్వంలో హెచ్.మురళి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే రెండు భాషల్లోని ప్రముఖ నటులను ఇందులో చేర్చారు. రాజా, మీరాచోప్రా, నమితతో పాటు తమిళ హాస్యనట దిగ్గజాలైన వడివేలు, వెన్నెరాడై మూర్తి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు చెన్నైలోని ఎఆర్ఎస్ గార్డెన్స్ లో నమిత, వడివేలు తదితరులపై చిత్రీకరిస్తున్నారు.
షాట్ గ్యాప్ లో నమిత మాట్లాడుతూ, వడివేలు కామెడీ అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ఈ చిత్రంలో వడివేలు కామెడీ చేర్చమని దర్శకుడిని తాను ప్రత్యేకంగా కోరారనీ చెప్పుకొచ్చింది. నమితకు సోదరుడిగా వడివేలు ఇందులో నటిస్తున్నారు. అయితే ఇందులో అన్నాచెల్లెళ్ల సెంటిమెండ్ సన్నివేశాలకు బదులు కామెడీ సీన్స్ ఉండేలా చూడాల్సిందిగా నమిత సదరు దర్శకుడిని కోరిందట. 'కథ ప్రకారం వడివేలు నాకు సోదరుడుగా నటిస్తున్నారు. అయితే సెట్స్ లో మాత్రం ఆయన్ని సార్ అనే సంబోధిస్తున్నారు. ఆ మాటకొస్తే నేను ఎవర్నీ బ్రదర్ అని పిలిచేదు లేదు' అంటూ తెలిపింది. మగవాళ్లంతా నాకు దగ్గర వాళ్లుగానే అనుకుంటాను. ఇక పెళ్లి అంటారా? అందుకు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి గ్లామర్ ను కాపాడుకుంటూ అభిమానులను అలరించడమే నా లక్ష్యం. ఇందుకోసం మాంసాహారం తీసుకోవడం మానేసాను. గత మూడు నెలలుగా ముక్క ముట్టనే లేదు...అంటూ చెప్పుకొచ్చింది నమిత. ప్రస్తుతం తమిళ 'ఇంద్రవిళ', తెలుగు 'దేశద్రోహి' చిత్రాల్లోనూ ఆమె బిజీగా ఉంది.
Be first to comment on this News / Article!
|