'వ్యాంప్ రోల్స్ కూ రెడీ'
గ్లామర్ ప్రపంచంలో అందం ఒక్కటే సరిపోదు. అదృష్టం కూడా కలిసిరావాలి. పూనమ్ బజ్వాకు ఇది వర్తిస్తుంది. 'మొదటి సినిమా', 'బాస్', 'వేడుక' వంటి పలు చిత్రాల్లో నటించిన పూనమ్ సరైన సక్సెస్ ను మాత్రం అందింపుచ్చుకోలేదు. ఈమధ్యనే 'పరుగు' చిత్రంలో ఓ గెస్ట్ రోల్ పోషించింది. సినిమా హిట్టయినా ఆమెకు వచ్చిన క్రెడిట్ స్పల్పమే. ప్రస్తుతం తన కెరీర్ ను ఇతర భాషా చిత్రాల వైపు కూడా మళ్లిస్తూ బిజీగా ఉన్న పూనమ్ కు తమిళంలో మూడు సినిమాలున్నాయి. టాలీవుడ్ లో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాననీ, వైవిధ్యమైన పాత్రల పోషణతో ప్రయోగాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ పూనమ్ చెబుతోంది.
పూనమ్ ఇటీవల కాలంలో 50కి పైగా తెలుగు సినిమాల స్ర్రిప్టులు విందట. ఏ ఒక్కటీ ఆమెకు నచ్చలేదట. 'అయితే బబ్లీగా ఉంటే అమ్మాయి పాత్ర అవుతోంది. అలాకాకుంటే అమాయకంగా కనిపించే గ్రామీణ అమ్మాయి పాత్రలు అవుతున్నాయి. ఇలాంటి పాత్రలు ఇప్పటికే చాలా చేశాను. స్టీరియో టైప్ క్యారెక్టర్లు నాకు అక్కర్లేదు. ప్రస్తుతం తమిళంలో జీవాతో ఓ సినిమా, శ్రీకాంత్, విష్ణులతో రెండు సినిమాలు చేస్తున్నాను' అని పూనమ్ చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళ భాషా చిత్రాల మధ్య ఎలాంటి తేడా కనిపించిందని అన్నప్పుడు, ఆడియెన్స్ రెస్పాన్స్ లో తేడా కనిపిస్తుందని తెలిపింది. టాలీవుడ్ లో ఇప్పటికీ గ్రామర్ కే పెద్దపీట వేస్తుండగా, తమిళంలో ఆడియెన్స్ మేకప్ తక్కువగా ఉండే డీగ్లామర్ పాత్రలను కూడా ఆదరిస్తుంటారనీ, కళాత్మక చిత్రాలను ఎంతో బాగా ఆదరించే ప్రేక్షకులు అక్కడ ఉన్నారనీ చెప్పుకొచ్చింది. ఇందుకు తగ్గట్టుగానే తాను కూడా గ్లామర్ ఇమేజ్ కు బదులుగా సీరియస్ రోల్స్ వైపు మళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. 'స్టీరియో టైప్ రోల్స్ కు బదులు సెలక్టివ్ గా అయినా మంచి సినిమాలే చేయాలనుంటున్నాను. ఏదో ఒకరోజు వ్యాంప్ రోల్స్ కూడా చేయడానికి నేను ఇష్టపడొచ్చు' అంటూ డేరింగ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. కెరీర్ ను ఏదో హడావిడిగా చుట్టేయాలని అనుకోవడం లేదనీ, ప్రస్తుతం తన కెరీర్ నడుస్తున్న తీరు ఎంతో హ్యాపీగా ఉందనీ, ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలోదనీ, అవార్డులు కొట్టేయాలనే తపన కూడా లేదనీ చెప్పుకొచ్చింది. విలక్షణ పాత్రల పోషణలో వ్యాంప్ రోల్స్ కు కూడా రెడీ అంటున్న పూనమ్ కు మళ్లీ టాలీవుడ్ నుంచి ఆశించిన ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|