వెంకటేష్ తో ఆనంద్ రంగా
సిద్దార్ధ హీరోగా 'ఓయ్' చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ రంగా ఇప్పుడు దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా మారుతూ టాలీవుడ్ లో బిజీ కావాలనుంటున్నారు. బరువైన సబ్జెక్ట్ తో 'ఓయ్' చిత్రాన్ని ఆనంద్ రంగా తెరకెక్కించిన తీరు పరిశ్రమ ప్రముఖుల ప్రశంసలు చూరగొంటోంది. 'గీతాంజలి' తరహాలో ఈ చిత్రం ఉందని సినీ ప్రముఖులు ప్రశంసిస్తుండగా, సినిమా ముగింపు విషాదాంత కావడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. తాజాగా ఆనంద్ రంగా నిర్మాతగా కూడా మారబోతున్నారు. గురు ఫిలిమ్స్ బ్యానర్ పై ఓ కొత్త చిత్రానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ పిప్పళ్ల ('బోణి' ఫేమ్) దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. ఆసక్తికరంగా దర్శకుడుగా ఆనంద్ రంగా తదుపరి చిత్రం విక్టరీ వెంకటేష్ తో ఉండబోతోందని కూడా తెలుస్తోంది.
ఆనంద్ రంగా చెప్పిన ఓ స్టోరీ లైన్ వెంకటేష్ కు బాగా నచ్చిందనీ, పూర్తి స్క్రిప్టు రెడీ చేయాల్సిందిగా సూచించారనీ తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.సురేష్ బాబు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రానికి వెంకటేష్ కమిట్ అయ్యారు. ఈ చిత్రం తర్వాత ఆనంద్ రంగా సినిమా సెట్స్ పైకి రావచ్చు.
Be first to comment on this News / Article!
|