ఆస్ట్రేలియా చుట్చొచ్చిన 'శంఖం'
గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'శంఖం'. ఈ చిత్రం కోసం రెండు పాటలను ఆస్ట్రేలియాలోని సుందర ప్రదేశాలలో చిత్రీకరణ జరిపిన యూనిట్ తిరిగి హైద్రాబాద్ చేరుకుంది. ఆవిశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
కథానుగుణంగా అన్నివిధాలా సరిపోయే టైటిల్ ఇదనీ, గోపీచంద్, త్రిషలపై ఆస్ట్రేలియాలో రెండు పాటలను చిత్రీకరించామనీ నిర్మాతల్లో ఒకరైన జె.భగవాన్ తెలిపారు. త్వరలోనే ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలవుతాయని మరో నిర్మాత జె.పుల్లారావు వివరించారు. గోపీచంద్ నుండి అన్ని తరగతుల ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయనీ, కథలోని ఓ కీలక పాత్రను సత్యరాజ్ పోషిస్తున్నారనీ చెప్పారు. ఈ చిత్రం హీరోగా గోపీచంద్ కూ, దర్శకుడిగా తనకూ మంచి పేరు తెస్తుందన్నారు. ఆగస్టులో సినిమా విడుదలకు ప్లానింగ్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎం.ఎస్.నారాయణ, ఎల్బీ శ్రీరాం, రఘునాథరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీత, రజిత, తెలంగాణ శకుంతల, రాధాకుమారి తదితరులు నటిస్తున్నారు. అనిల్ రావిపూడి మాటలు, వెట్రి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, విజయ్-సెల్వ ఫైట్స్, తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|