దండుకుంటున్న 'వ్యాపారి'
'100 పర్సంట్ ప్రాఫిట్' అనే ట్యాగ్ లైన్ కు న్యాయం చేస్తూ ఈనెల 11న విడుదల చేసిన 'వ్యాపారి' చిత్రం కొనుగోలుదారులందరికీ నూరు శాతం లాభాలు, ప్రేక్షకులకు నూరు శాతం వినోదాన్ని పంచుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎస్.జె.సూర్య, తమన్నా, నమిత ప్రధాన పాత్రధారులుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'వ్యాబారి' చిత్రం తెలుగులో 'వ్యాపారి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రణతి క్రియేషన్స్ పతాకంపై కూనిరెడ్డి శ్రీనివాస్ తొలిసారిగా ఈ అనువాద చిత్రంతో నిర్మాతగా మారారు.
క్లోనింగ్ అంశంతో భారతదేశంలో తొలిసారిగా నిర్మితమైన 'వ్యాపారి' సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందనీ, తమ అంచనాలను మించి ఓపినింగ్స్ వచ్చాయనీ నిర్మాత తెలిపారు. ఈ సంవత్సరం విడుదలైన డబ్బింగ్ సినిమాలలో మొదటి పెద్ద విజయం 'వ్యాపారి'దే కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎస్.జె.సూర్య ద్విపాత్రాభినయం, తమన్నా, నమిళ, మాళవికల గ్లామర్, ప్రకాష్ రాజ్, నాజర్, సీత పెర్ ఫారెమెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయనీ, అలాగా ఈ చిత్రంలోని అమ్మ పాట కూడా మంచి హిట్టయిందనీ తెలిపారు. నిర్మాతగా తమ తొలిచిత్రం ఇంత మంచి విజయం సాధించడం సంతోషంగా ఉందనీ, భవిష్యత్తులో తమ బ్యానర్ పై మరిన్ని మంచి చిత్రాలు అందిస్తామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|