కొత్తగా ఉండే 'పాయిజన్'
కొత్త తరహా ఇతివృత్తాలతో వస్తున్న పలు చిత్రాలు ఇటీవల ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'పాయిజన్' చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఆ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు. రాజీవ్ కనకాల, సింధుతులాని, సుహాసిని హీరో హీరోహీరోయిన్లుగా, ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, విజయసామ్రాట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనూప్ చక్రవర్త సమర్పణలో జోషిక సాయిలక్ష్మీ ఫిలింస్ పతాకంపై పణిరాజ్ దర్శకత్వంలో డి.రమేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఇంతవరకూ రాని ఓ వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు పణిరాజ్ తెరకెక్కించినట్టు నిర్మాత రమేష్ బాబు తెలిపారు. ప్రధాన పాత్రధారులంతా తమ పాత్రలను ఎంతో బాగా పోషించారనీ, ముఖ్యంగా ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రను పోషించడమే గాకుండా ఆమె చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అవుతుందనీ తెలిపారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయనీ, త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనీ తెలిపారు. తమ బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ధర్మరపు, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, శ్రీనివాసరెడ్డి, గీతాసింగ్ తదితరులు నటించారు. రామస్వామి మాటలు, పి.ఎస్.వంశీకృష్ణ సినిమాటోగ్రఫీ, వి.నాగిరెడ్డి ఎడిటింగ్, చంద్రలేఖ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|