బ్యాంకాక్ లో 'ఏక్ నిరంజన్'
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యాటీ కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఏక్ నిరంజన్'. పూరీ జగన్నాథ్ సమర్పణలో ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యరామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12 నుంచి బ్యాంకాక్ లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఆదిత్యారామ్ ఆ విశేషాలను తెలియజేస్తూ, జూన్ లో 12 రోజుల పాటు స్విట్జర్లాండ్ లోని అందమైన లొకేషన్లలో ప్రభాస్, కంగనాలపై రెండు పాటలను చిత్రీకరించామనీ, ఈనెల 12 నుంచి బ్యాంకాక్ లో కీలక షెడ్యూల్ జరుగుతోందనీ చెప్పారు. నెలరోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్ లో చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందన్నారు. బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత హైద్రాబాద్ లో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు. ప్రభాస్ నటన హైలైట్ గా పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూ సూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సంగీత, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పూరీ జగన్నాథ్ అందస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|