బ్రహ్మీకి ఎస్ఎంఎస్ ల వరద
అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్ పతి'తో మరోసారి సంచలనం రేకెత్తించనూవచ్చు. 'దస్ కా దమ్'కు సల్మాన్ పాపులారిటీ తీసుకుని ఉండొచ్చు. వీటన్నింటిని తలదన్నేలా నేను చేపట్టే బ్రహ్మి టెన్ లాక్ షో ఉండబోతోంది...అంటున్నారు ప్రముఖ కమెడియన్ పద్మశ్రీ బ్రహ్మానందం. ఆయనతో 'ఐ న్యూస్' ఛానెల్ త్వరలోనే 'బ్రహ్మి టెన్ లాక్ షో'ను ప్రారంభించబోతోంది. బ్రహ్మానందం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన హాట్ సీట్ విజేత 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ను ఎగరేసుకుపోవచ్చు. ఆగస్టు నుంచి ఈ టాక్ షో మొదలవుతుంది.
'బ్రహ్మి టెన్ లాక్ షో' కోసం ఎంఎస్ఎస్ ల ద్వారా ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. ప్రతిరోజూ 80,000కు పైగా ఎస్.ఎస్.ఎం.లు తనకు అందుతున్నాయని, ప్రాంత్రీయ ఛానెల్స్ లోనే ఈ తరహా షో వీక్షకుల ముందుకు రావడం ఇదే ప్రథమం అవుతుందనీ బ్రహ్మానందం ధీమా వ్యక్తం చేశారు. ఐ న్యూస్ డెరక్టర్ వాసు మంతెన తనను కలిసి ఈ షో కాన్సెప్ట్ చెప్పగానే తాను ఎంతో థ్రిల్ అయ్యాననీ, మరో ఆలోచనకు తావులేకుండా అంగీకరించాననీ ఆయన చెప్పుకొచ్చారు. ఈ షోలో పాల్గొనాలనుకునే వారు మూడు దశల్లో తమ సామర్థ్యం నిరూపించుకున్నతరువాతే హాట్ సీట్ వరకూ చేరగలుగుతారు. మొదటి ప్రశ్న వెయ్యి రూపాయిలతో మొదలవుతుంది. మొత్తం 15 ప్రశ్నలకు కచ్చితమైన జవాబులు చెప్పగలిగితే పదిలక్షలు విజేత సొంతమవుతాయి. గెస్ట్ కాంపటీటర్స్ గా పలువురు పాపులర్ స్టార్స్ ను కూడా (శని, ఆదివారాల్లో) ఈ షోలో పాల్గొంటారు. 836 చిత్రాల్లో నటించిన విశేషానుభవమున్న బ్రహ్మీ బుల్లితెరపై తన తొలి షో ను ఏ రేంజ్ కు తీసుకువెళ్తారనేది ఇప్పడు బుల్లెతెర వీక్షకులలో ప్రధాన చర్చనీయాశవుతోంది.
Be first to comment on this News / Article!
|