బ్రహ్మీకి ధీటుగా ఆలీ టాక్ షో!
నిన్నమొన్నటి వరకూ ఇతర భాషా ఛానెల్స్ కే పరిమితమైన రియాల్టీ షోలు ఇప్పుడు తెలుగు టెలివిజన్ ఛానెల్స్ లోనూ వీక్షకులను అలరిస్తూ టిఆర్ పి రేటింగ్ ను గణనీయంగా పెంచుకుంటున్నాయి. 'సరెగమప', 'లక్ష్మీ టాక్ షో', 'ఆట', 'రేలారేలారే' వంటి పలు రియాల్టీ షోలు తెలుగు ఛానెల్స్ కు సరికొత్త గ్లామర్ తెచ్చిపెట్టాయనే చెప్పాలి. ఇయితే ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ కే రియాల్టీ షోలు పరిమితం కాకుండా ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ కు కూడా ఇందుకు సన్నద్ధమవుతున్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందంతో 'బ్రహ్మీ కా దస్ లాక్'షో ఆగస్టు నుంచి 'ఐన్యూస్' ఛానెల్ లో ప్రసారానికి రెడీ అవుతోంది. తొలి ప్రశ్నకు వెయ్యి రూపాలయతో మొదటి పెట్టి బ్రహ్మానందం అడిగే 15 ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి 10 లక్షలు బహుమతిగా ఇవ్వబోతున్నారు. ప్రాంతీయ ఛానెల్స్ లో ఈ తరహా షో ఇదే ప్రథమని ఛానెల్ నిర్వాహకులు, బ్రహ్మానందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరంగా ఇప్పుడు మరో ప్రముఖ కమెడియన్ ఆలీతో ఓ టాక్ షో నిర్వహంచేందుకు మరో తెలుగు ఛానెల్ సన్నాహాలు చేస్తుంది.
బాలనటుడి స్థాయి నుంచి కమెడియన్ గా, కామెడీ హీరోగా 550కి పైగా చిత్రాల్లో ఆలీ నటించారు. అయితే బ్రహ్మానందం కంటే ఆలీ ముందుగానే పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఆయనకు కొద్దిపాటి బ్రేక్ కెరీర్ మధ్యలో వచ్చిందనీ, బ్రహ్మానందం ముందు జాగ్రత్తగా తన సినిమాల ముహూర్తాలతో సహా రిలీజ్ తేదీల వరకూ అన్ని రికార్డు చేసి ఉంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిందనీ అంటారు. బ్రహ్మీకి ఆలీ మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలగని భావించిన 'ఎన్ టీవీ' న్యూస్ ఛానెల్ తాజాగా ఆలీ తో ఓ టాక్ షో కి ప్లాన్ చేసిందనీ, ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతోందనీ తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన కూడా వెలువడే అవకాశాలున్నాయి. బ్రహ్మానంద వెర్సస్ ఆలీ షోలలో ఎవరిది పైచేయి అవుతుందో, ఏ ఛానెల్ టిఆర్ పి రేటింగ్ 'తారా'స్థాయికి చేరుకుంటుందో చూడాలి.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|