ఇలియానాపై హీరోల మనసు
'దేవదాసు', 'పోకిరి', 'జల్సా' చిత్రాలతో టాలీవుడ్ లో తన ప్లేస్ ను పదిలం చేసుకున్న ఇలియానా ఇటీవలే 'కిక్' తో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇలియానా చేతిలో ఉన్న రెండు తెలుగు సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్ లుగా మారాయి. 'దేవదాసు'తో తన కెరీర్ కు శ్రీకారం చుట్టిన వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలోనే విష్ణు కథానాయకుడుగా రూపొందుతున్న 'సలీమ్', నితిన్ 'రెచ్చిపో' చిత్రాల్లో ఇలియానా ప్రస్తుతం నటిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రానికి కూడా ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే తరుణంలో పలువురు తమిళ హీరోలు కూడా ఇలియానాను కోలీవుడ్ వైపు ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళంలో 'కేడి' చిత్రంలో నటించిన ఇలియానా మళ్లీ ఆ సినిమా తర్వాత తమిళ చిత్రాల వైపు తొంగిచూడ లేదు. ప్రస్తుతం ఇలియానా మనసు మారిందనీ, రెండు తమిళ చిత్రాల్లో నటించేందుకు సుముఖంగా ఉందనీ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలియానా గతవారమే విక్రమ్ హీరోగా నటించనున్న తదుపరి చిత్రం స్క్రిప్టును ఓపిగ్గా విన్నారనీ, ఇక ఓకే చేయడమే తరువాయనీ అంటున్నారు. మరో హీరో శింబు సైతం తన తదుపరి చిత్రం కోసం ఇలియానాను ఒప్పించాలనే ఆలోచనలో ఉన్నారు. శింబు ఈ నెలలోనే స్యయంగా హైద్రాబాద్ వచ్చి ఇలియానాను స్వయంగా కలవబోతున్నారట. ఇలియానా ఈమధ్యనే విజయ్, అజిత్ సినిమాల్లో చేసే అవకాశాలు వచ్చినా డేట్లు సర్దుబాటు కాని కారణంగా వదులుకుంది. రజనీకాంత్ 'సుల్తాన్ -ది వారియర్'లోనూ ఇలియానాకు అవకాశం వచ్చినా దూరంగానే ఉండిపోయింది. త్రిష, అనుష్క వంటి హీరోయిన్లు ద్విభాషా చిత్రాలు ఎడాపెడా చేస్తున్న తరుణంలో ఇలియానా కూడా ఈసారి తమిళ చిత్రాల వైపు మొగ్గుచూపుతుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|