తమిళంలోకి ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తమిళ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధపడుతున్నారు. ప్రభాస్, త్రిష జంటగా పూరీ జగ్ననాథ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన 'బుజ్జిగాడు..మేడ్ ఇన్ చెన్నై' చిత్రం ఇప్పుడు తమిళంలోకి 'కుమరన్ రజనీ రసిగన్' పేరుతో అనువాదమవుతోంది. తెలుగు వెర్షన్ లో కొంత భాగం చెన్నైలో చిత్రీకరించడం, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానిగా ప్రభాస్ నటించడంతో పాటు ఓ పాటలో రజనీ సినిమాలకు చెందిన క్లిప్పింగ్స్ తో ఓ పాట కూడా ఉండటం విశేషం. ప్రముఖ గాయకుడు మనో ఈ చిత్రం అనువాద హక్కులను పొంది తమిళంలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
మనో కుమారులైన షహీర్, రఫీఖ్ లు 'కుమరన్ రజనీ రసిగన్' చిత్రం ద్వారా సింగర్లుగా పరిచయమవుతున్నారు. రాజరాజ సంభాషణలు అందిస్తున్నారు. త్రిషకు సహజంగా డబ్బింగ్ చెప్పే రేణుక చేత ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఒక స్ట్రయిట్ తమిళ చిత్రం తరహాలో
65కు పైగా ప్రింట్లతో ఆగస్టు ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసేందుకు మనో ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|