'మహాత్మ' ఆడియోకి తుషార్
మనదేశానికి ఎందరో భారతరత్నలు ఉన్నా, జాతిపిత ఒకరేననీ, మహాత్మాగాంధీ సిద్ధాంతాలు నేటికీ ఆచరణయోగ్యమనే కథాంశం చుట్టూ రూపొందుతున్న చిత్రం 'మహాత్మ'. హీరో శ్రీకాంత్ 100వ చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్ 12 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ కు జోడిగా భావన నటిస్తోంది. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఆగస్టు 15న ఈ చిత్రం ఆడియో వినూత్నంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
'మహాత్మ' చిత్రాన్ని గత ఫిబ్రవరి 15న పలువురు సినీరాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. చిరంజీవి, దాసరి నారాయణ రావు, కె.రాఘవేంద్రరావు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే తరహాలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ మనువడు తుషార్ గాంధీ చేతుల మీదుగా ఆడియో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|