నిర్మాణరంగంలో '3 ఏంజిల్స్'
మూడు దశాబ్దాలుగా నటరత్న ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ ఎన్నో విజయవంతమైన భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన క్రెడిట్ వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ కు దక్కుతుంది. ఇప్పడు ఆయన కుమార్తెలైన స్వప్న దత్, ప్రియాంక దత్, స్రవంతి దత్ లు కూడా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. '3 ఏజెంల్స్ ప్రొడక్షన్స్' అనే బ్యానర్ పై దత్ కుమార్తెలు చిత్రనిర్మాణం చేపడుతున్నారు. క్వాలిటీతో కూడిన చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాణమే లక్ష్యం ఈ సంస్థ వరుస చిత్రాల నిర్మాణాన్ని సాగించనుంది. సంస్థ తొలిచిత్రంగా 'బాణం' శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈ చిత్రం ద్వారా నారా రోహిత్ హీరోగా పరిచయం అవుతున్నారు.
నారా చంద్రబాబునాయుడు సోదరుడుడైన నారా రామ్మూర్తి తనయుడే నారా రోహిత్. ఈ చిత్రం ప్రచారార్భాటాలకు దూరంగా నిర్మాణం జరుపుకొంటోంది. త్వరలోనే ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించి ఈ చిత్రానికి పనిచేసిన యంగ్ టీమ్ ను అశ్వనీదత్ పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రం తర్వాత నికిల్, నవదీప్ హీరోలుగా మరో చిత్రాన్ని కూడా '3 ఏంజెల్స్ ప్రొడక్షన్స్' ప్లాన్ చేస్తోంది. ప్రకాష్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|