ఏడిదకు 'లైఫ్ టైమ్' ప్రదానం
ఏడిద నాగేశ్వరరావు మాట్లాడుతూ, తన నలభై ఏళ్ల సినీ జీవితంలో ఇది తన జీవితంలో మరపురాని రోజని అన్నారు. నటుడిని అవుదామని పరిశ్రమకు వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనీ, 'సిరిసిరిమువ్వ' సినిమాకి వర్కింగ్ పార్టనర్ గా కూడా చేసి ఆ తర్వాత కె.విశ్వనాథ్ గారితో ఏడు సినిమాలు తీశాననీ అన్నారు. దేవుని కృప వలన నిర్మాత కాగలిగానని అన్నారు. ఎన్నో జాతీయ, రాష్ట్రీయ పురస్కారాలు అందుకున్నానీ, తనను ఈ స్థాయిలో నిలబెట్టిన దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా 'సినీ పూర్ణోదయం' రచయిత పులగం చిన్నారాయణ, ప్రచురణ కర్తలు సూరిబాబు, శ్రీకాంత్లను చిరంజీవి చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రంలో కోడి రామకృష్ణ, ఎస్.పి.శైలజ, విజయ్ చందర్, రాళ్లపల్లి, గుండుహనుమంతరావు, జమునారాణి తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|