'మగధీర' కౌంట్ డౌన్...
'మగధీర'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రామ్ చరణ్ సన్నద్ధమవుతున్నారు. యూరప్ లో రెండు పాటల చిత్రీకరణ జరిపిన యూనిట్ తిరిగి హైద్రాబాద్ కు చేరుకుంది. పాటల చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ నిర్మాణ విలువలతో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు సినిమా చరిత్రలోని ఇంతకు ముందు చూడని విజువల్ ఫీస్ట్ గా ఈ చిత్రం ఉంటుందని రామ్ చరణ్ తెలిపారు.
హీరోగా తన రెండవ చిత్రమే ఇంత భారీగా రూపొందడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించిందనీ తెలిపారు. అత్యున్నత నిర్మాణ విలువలతో రాజమౌళి ఎక్స్ టార్డినరీ టేకింగ్ తో ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. కీరవాణి సంగీతం సినిమాకి ప్రాణమైతే, రీకార్డింగ్ ట్రాక్ ను సీడీలుగా కూడా రిలీజ్ చేయవచ్చనీ, అలాగే కెమెరామన్ సెంథిల్ అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారనీ చెప్పారు. టీమ్ వర్క్ తో సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్ వచ్చిందనీ, అలాగే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారనీ చెప్పారు. ఈనెల చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. కాజల్ అగర్వాల్, శ్రీహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, ఎం.రత్నం మాటలు, రమా రాజమౌళి స్టైలింగ్, రవీందర్ కళాదర్శకత్వం, పీటర్ హెయిన్స్-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|