దీపిక సాంగ్ తో 'లవ్ 4 ఎవర్'
డిఫరెంట్ లవ్ స్టోరీ...
ఈ చిత్రంలోని పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనీ, ఉదాహరణకు ఐ లవ్ యు చెప్పాలనిపిస్తే చెప్పేయ్యాలనీ, వెయిట్ చేసి ఎప్పుడో చెప్పి...ముందే చెప్పుంటే బాగుండేదని ఫీల్ కాకూడదనీ, అలాగే సారీ చెప్పాలనుకున్నా వెంటనే చెప్పాయాలనీ, అదే అంశాన్ని తీసుకుని చేసిన డిఫరెంట్ లవ్ స్టోరీ ఇదనీ జయంత్ తెలిపారు. ఈ సినిమా చూసిన వారంతా ఇమిడియట్ గా తాము ఎవరికైనా చెప్పాలనుకున్నది ఫోన్ చేసి చెప్పేస్తారనీ, ఈ సినిమా అంత ఇంపాక్ట్ కలిగిస్తుందనీ అన్నారు. ఈ చిత్రానికి రామ్ సంపత్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారనీ, ఆయన అమీర్ ఖాన్ హీరోగా నటించే ఓ హిందీ సినిమాకు కూడా కమిట్ అయ్యారనీ చెప్పారు. అలాగే గజనీ, న్యూయార్క్ వంటి భారీ చిత్రాలకు డాన్స్ కంపోజ్ చేసిన అహ్మద్ ఖాన్ 'లవ్ 4 ఎవర్' పాటలకు కొరియాగ్రఫీ అందించారనీ తెలిపారు. ఆగస్టులో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో రణదీప్, మృదుల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్విత కథ, జయంత్ సి పరాన్జీ మూలకథ, రాజసింహ మాటలు, జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|