అలరించే 'కలవరమాయె..'
స్వాతి, కమల్ కామరాజు జంటగా రూపొందిన 'కలవరమాయె మదిలో' చిత్రం చాలా బాగా వచ్చిందని చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల తెలిపారు. సతీష్ కాశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలవుతోంది. హైద్రాబాద్ లోని ఎఫ్ఎన్ సిసిలో బుధవారంనాడు చిత్రయూనిట్ సమావేశమైంది. కమల్ కామరాజు, స్వాతి, దర్శకనిర్మాతలు ఇందులో పాల్గొన్నారు.
మంచి విలువలతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్తున్నానమనీ, అందరూ ఆదరించాలనీ మోహన్ వడ్లపట్ల పేర్కొన్నారు. ఇందులో స్వాతి చక్కటి అభినయాన్ని ప్రదర్శించిందనని చెప్పారు. కమల్ కామరాజు మాట్లాడుతూ, ఎలాంటి ఒత్తిడిలు లేకుండా సాపీగా సాగే కథాగమనంతో ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని స్వాతి పేర్కొంది. ఇది మంచి విలువలున్న సినిమా అనీ, అందరూ కష్టపడి పనిచేశారనీ సతీష్ కాశెట్టి తెలిపారు. ఇందులో స్వాతి నటన సావిత్రిలాగా ఉంటుందని అనడంలో అతిశయోక్తి ఉండదన్నారు. ఇలాంటి మంచి చిత్రాన్నిప్రేక్షకులు ఆదిరిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.
Be first to comment on this News / Article!
|