'వెంగమాంబ'తో జన్మధన్యం
తరిగొండ వెంగమాంబ చరిత్రను సినిమాగా తెరకెక్కించే అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకృతమనీ, తిరుపతి కొండపై వేంకటేశ్వర స్వామి కొలువున్నంత కాలం వెంగమాంబ చరిత్ర చిరస్మరణీయమనీ నిర్మాత దొరస్వామిరాజు అన్నారు. మీనా ప్రధాన పాత్రలో విఎంసి పతాకంపై ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో దొరస్వామి రాజు నిర్మించిన 'వెంగమాంబ' చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర విశేషాలను యూనిట్ తెలియజేసింది. దర్శకనిర్మాతలతో పాటు అనంత్, శరత్ బాబు,సుబ్బరాయశర్మ, అశోక్ కుమార్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
దొరస్వామి రాజు మాట్లాడుతూ, ఈ చిత్రానకి సెన్సార్ క్లీన్ సర్టిఫికెట్ లభించిందనీ, తమ సంస్థ నిర్మించిన 'సీతారామయ్యగారి మనుమరాలు' ద్వారా హీరోయిన్ గా పరిచయమైన మీనా ఈ చిత్రంలో నటించిన అనంతరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. 'అన్నమయ్య' వంటి అద్భుత భక్తిరస చిత్రం తర్వాత 'వెంగమాంబ' తీసే అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు ఇవ్వడంతో జన్మధన్యమైందనీ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఆదరించాలని కోరారు. ఒక మంచి ప్రయోజనాత్మక సినిమా ఇదనీ, ఇలాంటి చిత్రాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీడియా మీదే ఉందనీ దర్శకుడు ఉదయ్ భాస్కర్ అన్నారు. ఒక పిక్నిక్ లా ఈ చిత్రం షూటింగ్ జరిగిందనీ, దర్శకుడు చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ నటుడు శరత్ బాబు పేర్కొన్నారు. చాలాకాలం తర్వాత ఇందులో మంచి పాత్ర చేసినట్టు కృష్ణవేణి చెప్పారు.
Be first to comment on this News / Article!
|