సిమ్రాన్ 'నా వయసు 16'
తెలుగులో అగ్రహీరోలందరితోనూ హీరోయిన్ గా నటించి పెళ్లి తర్వాత ఇటీవల సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సిమ్రాన్ ఇప్పుడు 'నా వయసు 16' అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతోంది. ఏడాది క్రితం తమిళంలో ఎం.శ్రీధరన్ 'కిచా వయసు 16' చిత్రాన్ని నిర్మించాను. ఇప్పుడు ఆయనే విజయ సినీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై 'నా వయసు 16' పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి విడుదల చేయనున్నారు. ఆకాష్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి రాజగోపాల్ దర్శకత్వం వహించారు.
తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించిందనీ, ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయనీ నిర్మాత శ్రీధరన్ తెలిపారు. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాన్నారు. పదవ తరగతి చదవుకునే స్టూడెంట్ తన టీచర్ ను ప్రేమించడం ఈ చిత్రంలోని ప్రధానాంశమని చెప్పారు. టెన్త్ క్లాస్ స్టూడెంట్ గా మణికంఠ, టీచర్ గా సిమ్రాన్ నటించిందన్నారు. యువతను కవ్వించే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటున్నారు. సంగీత దర్శకుడు దిన 5 అద్భుతమైన పాటలను అందించారనీ, ప్రతి పాట ఎంతో రిచ్ గా దర్శకుడు తెరకెక్కించారనీ చెప్పారు. ఈ చిత్రానికి సాయి రమేష్ మాటలు, పొందూరి పాటలు అందించారు.
Be first to comment on this News / Article!
|