రామానాయుడులో 'పులి'
'జల్సా' సక్సెస్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కొమురం పులి' చిత్రంపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 'ఖుషీ' వంటి సెస్నేషన్ హిట్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ నటిస్తుండటంతో సహజంగానే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అయింది. కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతుండటంతో ఫ్యాన్స్ ఒకింత నిరాశచెందారు. ఇంతవరరూ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తిరిగి ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని కీలక ఘట్టాల చిత్రీకరణ జరిగింది. తాజాగా చిత్ర యూనిట్ రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ కు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఆనంద్ సాయి నేతృత్వంలో వేసిన భారీ సెట్ లో ఓ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు.
'ఖుషీ' చిత్రానికి మించిన సూపర్ డూపర్ హిట్ సినిమా అందించాలనే తపనతో 'కొమురం పులి'ని తీరిద్దితుద్దుతున్నట్టు ఎస్.జె.సూర్య తెలిపారు. పవన్ కల్యాణ్ మీసంతో కనిపించే స్టిల్స్ ఇప్పటికీ అందర్నీ అలరిస్తున్నాయనీ, గెటప్ కు తగ్గట్టుగా పవన్ తన పాత్రలో పరకాయప్రవేశం చేస్తూ అద్భుతమైన నటన ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఇందులో పవన్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అవినీతి అధికారులు, ఎమ్మెల్యేల భరతం పట్టే విధంగా ఆయన పాత్ర ఉంటుందనీ, పవన్ పలు సంభాషణలో పవర్ ఫుల్ సంభాషణలు పలుకుతారనీ తెలుస్తోంది. ఇంతవరకూ పలు ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలు చేస్తూ వచ్చిన పవన్ ఈసారి సామాజిక స్పృహ ఉన్న పాత్రను పోషిస్తుండటం విశేషం. పవన్ కు జోడిగా నిఖిష పటేల్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయవుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, శరణ్యం, నాజర్, ఆలీ తదితురుల నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్ ఈ చిత్రానికి బాలీవుడ్ కు చెందిన బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయన్ ఫైట్స్, ఆనంద్ సాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ సమకూరుస్తున్నారు.
Be first to comment on this News / Article!
|