సుకుమార్ గూటిలో తమన్నా
హ్యాపీడేస్'తో మంచి బ్రేక్ వచ్చిన అందాల నటి తమన్నాకు మళ్లీ తెలుగులో అలాంటి బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే తమిళంలో మాత్రం తమన్నా మంచి డిమాండ్ లో ఉంది. ప్రస్తుతం అక్కడ నాలుగు సినిమాల్లో ఆమె నటిస్తోంది. తాజాగా తమన్నా తెలుగులో ఓ కొత్త చిత్రానికి కమిట్ అయింది. గతంలో 'ఆర్య' వంటి హిట్ చిత్రాన్ని అందించి మళ్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తోనే 'ఆర్య-2' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ తన తదుపరి చిత్రానికి తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇది లేడీ ఓరియెంటెడ్ కథాంశం కావడం విశేషం. ఈ విషయాన్ని తమన్నా ధ్రువీకరించింది. కొందరు అనుకుంటున్నట్టు ఈ చిత్రం 'అరుంధతి' తరహాలో సోషియో ఫాంటసీ మాత్రం కాదనీ, అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాగానే ఉంటుందనీ ఆమె తెలిపారు.
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల వల్ల నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుందనీ, అలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉందనీ తమన్నా చెప్పింది. సబ్జెక్ట్ గురించి చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. తాను ఇబ్బడి ముబ్బడిగా రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలిపింది. స్క్రిప్టు ఎంత బాగుందనే విషయానికే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తాననీ, మిగతావన్నీ ఆ తర్వాతేననీ చెప్పుకొచ్చింది. తన పనికి తగ్గ పారితోషికాన్నే తాను తీసుకుంటున్నట్టు వివరించింది. అన్నట్టు...తమన్నా ఇప్పుడు 70 లక్షల వరకూ పలుకుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.
Be first to comment on this News / Article!
|