'ఓయ్' డబుల్ ప్లాటినం డిస్క్
సిద్దార్ధ, షామిలి (తొలి పరిచయం) జంటగా ఆనంద్ రంగాను దర్శకుడిగా పరియం చేస్తూ యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మించిన 'ఓయ్' చిత్రం ఇటీవల విడుదలై అభిరుచిగల చిత్రంగా ప్రేక్షకులకు చేరువవుతోంది. యవన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రెండు లక్షలకు పైగా అమ్మకాలు జరుపుకొంది. ఈ నేపథ్యంలో 'ఓయ్' చిత్రం డబుల్ ప్లాటినం డిస్క్ వేడుకను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో ప్రేక్షకుల మధ్య బుధవారం రాత్రి నిర్వహించారు. సిద్దార్ధ, ఆనంద్ రంగా, డివివి దానయ్య, రచయిత రాజసింహ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ఈ వేడుకను నిర్వహించింది.
సిద్దార్ధ మాట్లాడుతూ, కొత్త తరహా సినిమాలు రావడం లేదని అనుకునేవారికి ఈ తరహా కొత్త తరహా అనుభూతినిస్తోందనీ, ఈ చిత్రం గురించి రకరకాలుగా ప్రచారం జరిగినా ప్రేక్షకులే అంతిమ న్యాయనిర్ణేతలుగా విజయాన్ని అందించారనీ అన్నారు. సమష్టి కృషితో తీసిన ఈ చిత్రాన్ని ఆదర్శిస్తున్న ప్రేక్షకులందరికీ తన కృతజ్ఞతలని అన్నారు. మంచి చిత్రాలను ఆదరిస్తారని మరోసారి ప్రేక్షకులు రుజువు చేసుకున్నారనీ, వారందరికీ తన కృతజ్ఞతలనీ ఆనంద్ రంగా సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా తనకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిందనీ, తాను రాసిన సంభాషణలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనీ రచయిత రాజసింహ పేర్కొన్నారు. ఆడియోతో పాటు సినిమాను మంచి సక్సెస్ పథంలోకి తీసుకువెళ్లిన ప్రేక్షకులకు నిర్మాత దానయ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిత్రయూనిట్ కు డబుల్ ప్లాటినం డిస్క్ జ్ఞాపికలను అందజేశారు.
Be first to comment on this News / Article!
|