'బిల్లా' 100 రోజుల వేడుక
గోపీకృష్ణ బ్యానర్ తనకు కొత్త కాదనీ, గతంలో ఈ సంస్థ నిర్మించిన 'తాండ్రపాపారాయుడు' చిత్రంలో తాను నటించాననీ డాక్టర్ మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఒకరోజు మద్రాసులో షూటింగ్ జరుగుతుండగా వేరే ఊరిలో జరిగే మ్యారేజ్ కి వెళ్లాల్సి ఉందనీ, అదే విషయం చెప్పినప్పడు తనను బెంజి కార్ లో పంపించారనీ, తన జీవితంలో బెంజ్ కారు ఎక్కడం అదే మొదటిసారనీ అన్నారు. ఆ విధంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లను సొంత మనుషుల్లా భావించడం గోపీకృష్ణ సంస్థకు అలవాటని చెప్పారు. కృష్ణంరాజు తనకంటే సీనియర్ నటుడనీ, నటులుగా కంటే తాము ఎంతో ఆత్మీయులమనీ, కుటుంబ సన్నిహితులమనీ తెలిపారు. 'బుజ్జిగాడు' చిత్రంలో ఏ ముహూర్తాన తాను బావా అని పిలిచానో...ఆ పదానికి అసలనై నిర్వచనంలా ప్రభాస్ బిహేడ్ చేస్తాడనీ, అతను మంచి నటుడే గాక సంస్కారవంతుడనీ ప్రశంసించారు. వరుస విజయాలతో 100 సంవత్సరాలు గుడ్ హెల్త్ అండ్ వెల్త్ తో ప్రభాస్ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ, 'బిల్లా'తో గోపీకృష్ణ మూవీస్ ఒక అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిందనీ, ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలనీ అన్నారు. ఆలీ మాట్లాడుతూ, తొలిసారి ఈ సంస్థలో పనిచేసే అవకాశం 'బిల్లా' ద్వారా లభించిందనీ, మలేసియాలో 75 రోజులు షూటింగ్ జరిగిందనీ, ఏ ఒక్కరోజు కూడా ఇబ్బంది కలక్కుండా నిర్మాతలు ప్లాన్ చేశారనీ చెప్పారు. ఈచిత్రం మంచి హిట్ అయి 100 రోజుల షీల్డ్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
గోపీకృష్ణ మూవీస్ అనేది సంస్కారం కలిగిన గొప్ప సంస్థ అనీ, కొద్ది గ్యాప్ తర్వాత మరో మంచి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని ఆ సంస్థ అందించిందనీ కోట శ్రీనివాసరావు అభినందించారు. 'బిల్లా' కలెక్షన్ల 'ఖిల్లా'ను కొల్లగొట్టిందని కోడిరామకృష్ణ అభివర్ణించారు. ఈ సినిమా కథను ఇప్పటికే ఐదు సార్లు చూశామనీ, ప్రతి బిట్ తెలిసినా ఈ ప్రాజెక్ట్ ను ఎటమ్ట్ చేసి సక్సెస్ అవడం మామూలు విషయం కాదనీ, ఆ క్రెడిట్ మెహర్ రమేష్ కు దక్కుతుందనీ రాజమౌళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|